ఆదిలాబాద్‌లో విమానాశ్రయ సాధన కోసం సామాజిక బాధ్యతగా ‘సాక్షి’ చొరవచూపింది. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో బుధవారం నిర్వహించిన చర్చా వేదికకు విశేష స్పందన లభించింది. మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద, యువజన, విద్యార్థి సంఘాలతో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు భారీగా తరలివచ్చారు. తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా ఐక్యంగా ఉద్యమిస్తే తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. దశాబ్దాల కల సాకారం కావాలంటే ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. కేంద్రంపై వారి ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. అడహక్ కమిటీ ద్వారా ఐక్య పోరాటాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, బీఆర్‌ఎస్, కాంగ్రె
స్, వామపక్షాలు, కుల, విద్యార్థి సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, వృకోధర్, అల్లూరి భూమన్న, దేవిదాస్ దేశ్‌పాండే, కిష్టయ్య, బుట్టి శివ, దాసరి రమేశ్, రూపేష్ రెడ్డి, రత్నం రమేశ్, కుంటాల రాములు, ఎస్.అరుణ్ కుమార్, లంకా రాఘవులు, అశోక్, రవీంద్ర, కందుల రవీందర్, ఆశన్న, దయానంద్‌రెడ్డి, కె.నర్సింలు, రాజు, అన్నదానం జగదీశ్వర్, ప్రమోద్ కుమార్ ఖత్రి, సతీష్, ధమ్మపాల్, ఆసిఫ్, ఎన్.అశోక్ తదితరులు పాల్గొన్నారు.
విమానాశ్రయ సాధన కోసం ఉద్యమించేలా ప్రత్యేకంగా అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ వర్గాలతో కూడిన ప్రతినిధులను ఇందులో భాగస్వాములుగా చేర్చారు. కన్వీనర్‌గా సంద అశోక్, కోకన్వీనర్లుగా విజ్జగిరి నారాయణ, బండి దత్తాత్రి, కె.లక్ష్మారెడ్డి, ముడుపు ప్రభాకర్‌రెడ్డి, మల్లేశ్, సభ్యులుగా సోగల సుదర్శన్, పూసం ఆనంద్‌రావు, దాసరి రమేశ్, సిర్ర దేవేందర్, నిమ్మల ప్రశాంత్, నిమ్మల నరేందర్, బండారి సతీశ్, బి.శివకుమార్, వాగ్మారే ప్రశాంత్, బొజ్జ ఆశన్న, ఎంఏ హఖ్, పి.కిష్టయ్య, దేవిదాస్
దేశ్‌పాండే యమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment