ఇంటర్ పరీక్షలు షురూ
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్టియర్ పరీక్షలు షురూ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి నిమిషం ని బంధనను సడలించి 5 నిమిషాల వరకు పెంచారు. అయితే విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి పరీక్ష కావడంతో తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద సందడి కనిపించింది. విద్యార్థులను అధి కారులు పూర్తిగా తనిఖీ చేసి లోనికి అనుమతించా రు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిరోజున నిర్వహించిన లాంగ్వేజ్ పరీక్షకు 9,814 మందికి గాను 9,154 మంది హాజరైనట్లు డీఐఈవో జాదవ్ గణేశ్‌కుమార్ తెలిపారు. కలెక్టర్ రాజర్షిషా ప్రభుత్వ బాలికల జూ నియర్ కళాశాలతో పాటు పలు కేంద్రాలను పరిశీ లించారు. అలాగే సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment