మరిన్ని ఎస్‌హెచ్‌జీలు | - | Sakshi
Sakshi News home page

మరిన్ని ఎస్‌హెచ్‌జీలు

Published Fri, Mar 7 2025 10:15 AM | Last Updated on Fri, Mar 7 2025 10:11 AM

మరిన్

మరిన్ని ఎస్‌హెచ్‌జీలు

కై లాస్‌నగర్‌: తెల్లరేషన్‌ కార్డు కలిగి 18 ఏళ్లు నిండిన వివాహితులందరినీ స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) సభ్యులుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో కొత్తగా 115 సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి గత నెల 24వ తేదీన ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కసరత్తు చేపట్టిన మెప్మా సిబ్బంది స్వయం సహా యక సంఘాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన శ్రమిస్తున్నారు. వార్డుస్థాయిలోని మహిళలతో ప్రత్యేక సమావేఽశాలు నిర్వహిస్తూ ఎస్‌హెచ్‌జీల్లో చేరితే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఇప్పటివరకు కొత్తగా 69 సంఘాలు ఏర్పాటు చేయించారు. ఈ నెలాఖరునాటికి లక్ష్యాన్ని చేరుకునేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

మహిళల అభివృద్ధికి పెద్దపీట

కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నుంచి మ హిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తోంది. స్వ యం సహాయాక సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. బ్యాంక్‌ లింకేజీ, సీ్త్ర నిధి ద్వారా రుణాలు అందజేస్తూ వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు వివిధ రకాల 13 అంశాల్లో వారు స్వయం ఉపాధిని పొందడంతో పాటు ఆర్థికంగా ముందుకు సాగేలా ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద రూ.20 లక్షల నుంచి రూ.5కోట్ల వరకు రుణాలు ఇస్తూ వ్యాపారంలోనూ ముందుకు సాగేలా ప్రోత్సహిస్తోంది. ఇంతలా ప్రోత్సాహం అందిస్తున్నా ఇప్పటికీ అనేక మంది మహిళలు సంఘాల్లో లేనట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ ప్రయోజనాలకు దూరంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించాలని భావించి వారినీ ఎస్‌హెచ్‌జీల్లో సభ్యులుగా చేర్చాలని సంకల్పించింది. ఆ దిశగా మెప్మా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

కొత్త సంఘాల లక్ష్యం 115

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని తెల్ల రేషన్‌కార్డులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్తగా 115 ఎస్‌హెచ్‌జీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. 18 ఏళ్లు దాటిన, పెళ్లి చేసుకుని కొత్తగా మెట్టినింటికి వచ్చిన మహిళలను సంఘంలో నమోదు చేయించాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన మెప్మా సిబ్బంది లక్ష్యాన్ని సాధించేదిశగా ముందుకు సాగుతున్నారు. ప్రతీ సీవో పరిధిలోని రిసోర్స్‌పర్సన్లు తమమ వార్డుల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల కు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం.. కల్పి స్తున్న రాయితీలు, భీమా సౌకర్యం తదితర ప్ర యోజనాలను వారికి వివరిస్తూ సంఘంలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే జిల్లాలో కొత్తగా 69 సంఘాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సంఘంలో 10 మంది మహిళలను సభ్యులుగా నమోదు చేయిస్తున్నారు. ఇలా 690 మంది మహిళలను కొత్తగా సంఘాల్లో సభ్యులుగా చే ర్పించారు. ఇంకా 46 సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని సాధించేలా ముందుకు సాగుతున్నారు. సంఘాల్లో చేరిన మహిళల ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకుని బ్యాంక్‌ ఖాతాలు తెరిపిస్తున్నారు. పొదుపు చేయడం రుణాలు పొందే విధానంపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే కలిగే ప్రయోజనాల గురించి అర్థమయ్యేలా వివరిస్తున్నారు.

ఏర్పాటుకు ఆదేశించిన ప్రభుత్వం

ఆదిలాబాద్‌ బల్దియా లక్ష్యం.. 115

ఇప్పటికే 69 సంఘాల ఏర్పాటు

లక్ష్యసాధన దిశగా మెప్మా సిబ్బంది

ఈ నెలాఖరు వరకే గడువు విధింపు

ఆదిలాబాద్‌లోని వార్డులు : 49

తెల్ల రేషన్‌కార్డులు : 29,346

ప్రస్తుత ఎస్‌హెచ్‌జీలు : 2,567

సంఘాల్లోని సభ్యులు : 26,042

గడువులోపు లక్ష్యం సాధిస్తాం

స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలందరినీ సంఘాల్లోకి తీసుకురావాలని, తద్వారా కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపాలిటీకి లక్ష్యాన్ని నిర్దేశించింది. సీవోలు తమ పరిధిలోని రిసోర్స్‌ పర్సన్లతో వార్డుల వారీగా మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంఘాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఆరు నెలలు సక్రమంగా పొదుపు చేసే సంఘాలు రూ.5లక్షల రుణం పొందవచ్చు. రుణ మొత్తాన్ని సకాలంలో చెల్లిస్తే రూ.10లక్షల వరకూ రుణం ఇస్తారు. ఈ అవకాఽశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. మార్చి నెలాఖరునాటికి లక్ష్యాన్ని సాధిస్తాం.

– శ్రీనివాస్‌, మెప్మా డీఎంసీ, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
మరిన్ని ఎస్‌హెచ్‌జీలు1
1/1

మరిన్ని ఎస్‌హెచ్‌జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement