అభివృద్ధికి నిధులు కేటాయించండి
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
ఉట్నూర్‌రూరల్: అభివృద్ధి పనులకు నిధులు కేటా యించాలని తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి శరత్‌కు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గురువారం ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని నూతన ఐటీడీఏ భవన నిర్మాణానికి రూ.15 కోట్లు, నూతన స్టడీ సర్కిల్ నిర్మాణానికి రూ.2 కోట్లు, రాజ్‌గోండు సేవా సమితి గుస్సాడీ గుట్ట వద్ద నూతన భవన నిర్మాణానికి రూ.కోటి, ఉట్నూర్ నుంచి కొమ్ముగూడ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment