గాంధీపార్కు టెండర్ @ రూ.37.39లక్షలు
కైలాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కుకు గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి భారీగా ఆదాయం సమకూరింది. 2025–26 సంవత్సరానికి గాను పార్కు నిర్వహణ కోసం మున్సిపల్ అధికారులు ఈ నెల 22 నుంచి టెండర్లను ఆహ్వానించారు. బుధవారం టెండర్ దాఖలుకు తుది గడువు కాగా మొత్తం ఆన్‌లైన్‌లో రెండు, ఆఫ్‌లైన్‌లో ఐదు దాఖలయ్యాయి. సాయంత్రం ము న్సిపల్ కార్యాలయంలోని ఎంఈ చాంబర్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ కార్తీక్ ఆధ్వర్యంలో ఈ టెండర్లను ఖరారు చేశారు. రూ.18,21,600 ధరతో టెండర్లను పిలువగా అత్యధికంగా పట్టణానికి చెందిన టి.ప్రఽశాంత్ రూ.37లక్షల 39వేలకు టెండర్ దా ఖలు చేసి పార్కు నిర్వహణను దక్కించుకున్నాడు. టెండర్ వివరాలతో కూడిన నివేది కను కలెక్టర్‌కు పంపించి, వారి ఆదేశాల మే రకు కొత్త కాంట్రాక్టర్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని డీఈ తెలిపారు. ఇందులో బల్దియా టెక్నికల్ ఆఫీసర్ మమత, జూ నియర్ అసిస్టెంట్లు చందన్, శివానీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment