RGV Dhahanam Web Series Trailer: How to Watch Ram Gopal Varma's Crime Thriller Series Free?
Sakshi News home page

RGV Dahanam Movie: తొలిసారిగా ఆర్జీవీ వెబ్‌ సిరీస్‌.. ఇలా ఫ్రీగా చూసేయండి!

Published Mon, Apr 4 2022 4:12 PM | Last Updated on Sat, Apr 9 2022 10:24 AM

Ram Gopal Varma Dhahanam Web Series Trailer Out Now - Sakshi

ఎముకలలో సైతం వణుకు పుట్టించేలా యాక్షన్‌ థ్రిల్లర్‌లను రూపొందించడంలో సుప్రసిద్ధులు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన నిర్మాణ సంస్ధ నుంచి వస్తోన్న క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘దహనం’. తన  తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తపిస్తున్న ఓ కొడుకు కథ ఇది.  తాజాగా ఎంఎక్స్‌ ప్లేయర్‌లో దహనం ట్రైలర్‌ రిలీజైంది. ఈ ట్రైలర్‌లో..  ఓ కమ్యూనిస్ట్‌ నేత శ్రీరాములు హత్య గ్రామంలో సంచలనంగా మారుతుంది. రాములు పెద్ద కొడుకు హరి, ఓ విప్లవకారుడు  (నక్సలైట్‌). అడవిలో ఉండి గొరిల్లా తరహా పోరాటాన్ని భూస్వాములతో చేస్తుంటాడు. అతను తన తండ్రి మరణ వార్త విని ఆవేశంతో రగిలిపోతాడు. అక్కడి నుంచి ఆ గ్రామంలోని బలవంతులైన గూండాలకు, అతనికి జరిగే పోరాటం ఆసక్తి రేకెత్తిస్తుంది.

దీనికి తోడు నక్సలైట్ల ఆధిపత్యం గ్రామంలో పెరగడంతో ఈ ప్రాంతంలో భయాందోళనలూ పెరుగుతాయి. తన తండ్రి మరణానికి కారకులైన వారిపై హరి పగతీర్చుకున్నాడా  ? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఏడు ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. ఇషా కొప్పికర్‌, అభిషేక్‌ దుహన్‌, నైనా గంగూలీ, అశ్వత్‌ కాంత్‌ శర్మ, అభిలాష్‌ చౌదరి, పార్వతి అరుణ్‌, సయాజీ షిండే, ప్రదీప్‌ రావత్‌లు అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. ప్రతీకారం, రక్తపాతం, హింస నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్‌లోని అన్ని ఎపిసోడ్లు ఎంఎక్స్‌ ప్లేయర్‌లో ఏప్రిల్‌ 14 నుంచి ప్రసారం కానున్నాయి.

ఈ షో గురించి రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ‘‘నా మొట్టమొదటి వెబ్‌ సిరీస్‌ ‘దహనం’ను ఎంఎక్స్‌ ప్లేయర్‌ భాగస్వామ్యంతో రూపొందించడం పట్ల సంతోషంగా ఉన్నాను. ఈ కథనం రెండు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యల నడుమ దాగిన చీకటి కోణాన్ని స్పృశిస్తుంది. అవేమిటంటే, ‘కంటికి కన్ను అని అనుకుంటూ వెళ్తే ప్రపంచాన్ని గుడ్డిగా మార్చడంలో మాత్రమే మనం విజయం సాధించగలమ’ని మహాత్మాగాంధీ చెబుతారు.  కానీ మహాభారతంలో మాత్రం ‘ప్రతీకారం అనేది పూర్తిగా స్వచ్ఛమైన ఓ భావోద్వేగం’ అని చెబుతుంది. ‘దహనం’ వెబ్‌ సిరీస్‌లో కేవలం ప్రతీకారం గురించి మాత్రమే  వెల్లడించడం కాదు, ఆ ప్రతీకార పర్యవసానాలు కూడా చర్చించాము. ఇది క్రైమ్‌ థ్రిల్లర్‌ కాదు, కానీ థ్రిల్లింగ్‌ క్రైమ్‌తో కూడినది. ఊపిరిబిగపట్టి చూసేలా వీటిని తీర్చిదిద్దడం జరిగింది'

'ఈ షోతో మేము కేవలం ఓ అడుగు ముందుకేయడం కాదు, కథ డిమాండ్‌ చేసిన తీరుతో తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన నటీనటుల పర్ఫామెన్స్‌ వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో మైళ్ల దూరం వెళ్లగలిగాం. ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి మా మొత్తం బృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంది’’ అని అన్నారు. తెలుగులో రూపొందించిన ఈ సిరీస్‌ను హిందీ, తమిళ భాషలలో డబ్బింగ్‌ చేయనున్నారు.  ఈ ఎపిసోడ్స్‌ అన్నీ కూడా ఎంఎక్స్‌ ప్లేయర్‌పై పూర్తి ఉచితంగా చూడవచ్చు. ఈ సిరీస్‌ 14 ఏప్రిల్‌ 2022 నుంచి ప్రసారం కానుంది. దీనికోసం ఇప్పుడే ఎంఎక్స్‌ ప్లేయర్‌ యాప్‌ www.mxplayer.in డౌన్‌లోడ్‌  చేసుకోండి.
(అడ్వర్టోరియల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement