వాగులు దాటి వెళ్లిపాఠశాలల తనిఖీ
జి.మాడుగుల: పాఠశాలల ఉపాధ్యాయులు సమయ పాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఎంఈవో చిట్టపులి బాబూరావు పడాల్ సూచించారు. మండలంలో మారుమూల గ్రామాలు కిల్లంకోట, సుర్తిపల్లి, బూరెలపనుకు, కె.బంధవీధి, చింతగొప్ప గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను శనివారం ఆయన తనిఖీ చేశారు. వీటిలో పలు గ్రామాలకు రోడ్డు సదుపాయం లేక కొంత దూరం బైక్‌పైన, మరికొంత దూరం కాలినడన.. మార్గం మధ్యలో ప్రమాదకరమైన వాగులు దాటి వెళ్లి ఈ తనిఖీలు చేపట్టారు. పాఠశాలల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడు తూ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా సామర్థ్యాలు మరింత మెరుగుపరచడానికి దృష్టి సారించాలన్నారు. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల పైగా దూరంలో ఈ గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ యా గ్రామాలకు కొంత దూరం బైక్, 10 నుంచి 15 కిలోమీటర్ల కొండలు, గుట్టలు ఎక్కి దిగి, మార్గ మధ్య లో ప్రమదకరమైన గెడ్డలు దాటి ఆయన వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment