● నాబార్డు డీడీఎం చక్రధర్
చింతపల్లి: గిరిజన ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు నాబార్డు జిల్లా మేనేజరు చక్రధర్ తెలిపారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానంలో ఏడు రోజులపాటు తేనెటీగల పెంపకం, తేనె సేకరణపై ఇచ్చిన శిక్షణ సోమవారంతో ముగిసింది. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాబార్డు డీడీఎం పలు సూచనలు చేశారు. అనంతరం శిక్షణపొందిన రైతులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. తేనెటీగల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకుంటే రైతులకు మంచి లాభదాయకమని ఏడీఆర్ అప్పలస్వామి తెలిపారు. శాస్త్రవేత్తలు సందీప్‌నాయక్, వెంకటేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.