చింతపల్లిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
చింతపల్లి: చింతపల్లి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుందని ఎంపీపీ కోరాబు అనూషాదేవి, జెడ్సీటీసీ బాలయ్య అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చింతపల్లిలో తాగునీటి కోసం రూ.22 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు చేశామన్నారు. తాజాగా వాటికి ఆమోదం లభించిందన్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను పరిశీలించారు. పథకం తీరుతెన్నులు. దాని నిర్మాణం వంటి విషయాలను తాగునీటి సరపరా విభాగం ఏఈ స్వర్ణలత వివరించారు. ఈ పథకం అమల్లోకి వస్తే త్వరలో తాగునీటికి ఇబ్బందులు తొలగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, కోఆప్షన్ సభ్యుడు నాజర్‌వలి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment