ముంచంగిపుట్టు: మండలంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు వెళ్లే రోడ్డు, జోలాపుట్టు ప్రధాన మార్గం వర్షం నీటితో నిడిపోయాయి.రహదారులపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
లుక్కురులో ఇంటిపై పడిన పిడుగు
పనసపుట్టు పంచాయతీ లుక్కురులో వీర్రాజు అనే వ్యక్తి ఇంటిపై సాయంత్రం 5గంటల సమయంలో పిడుగు పడి మంటలు చెలరేగాయి. విద్యుత్ మీట రు, వైర్లు,టీవీ,ఫ్యాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.ఇంటిపైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. సుమారు రూ. 80వేలవరకు నష్టం సంభవించిందని,ప్రభు త్వం ఆదుకోవాలని బాధితుడు వీర్రాజు కోరారు.
డుంబ్రిగుడ: మండల కేంద్రం డుంబ్రిగుడలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈవర్షాలు రాకతో మామిడి పూతకు కొంత మేలు జరుగుతుందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముంచంగిపుట్టులో భారీ వర్షం