
యువత క్రీడల్లో రాణించాలి
● పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
గూడెంకొత్తవీధి: గిరిజన యువత క్రీడల్లో రాణించాలని పాడేరు ఎమ్మెల్యే ఎం. విశ్వేశ్వరరాజు అన్నారు. రింతాడ పంచాయతీ ఏబులంలో జాతర సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించి, కొద్దిసేపు ఆడారు. అనంతరం మాట్లా డుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్, జిల్లా శాఖ కోశాధికారి కుందేరి రామకృష్ణ,పార్టీ నాయకులు నారాయణ,రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.