
సైనికుల వైద్య సేవలకు యూఎస్–భారత్ ఎంవోయూ
సాక్షి, విశాఖపట్నం : తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం (ఈఎన్‌సీ) విశాఖపట్నంలో భారత్, యూఎస్ దేశాల మధ్య ప్రారంభమైన టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు కొనసాగుతున్నాయి. తొలి దశలో హార్బర్ ఫేజ్‌లో భాగంగా.. ఇరు దేశాల త్రివిధ దళాల ప్రతినిధుల మధ్య సమీక్షలు, చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మారీటైమ్ వార్‌ఫేర్ సెంటర్‌లో రెండు రోజుల పాటు ఇండియన్ నేవీ, యూఎస్ నేవీ వైద్య బృందాల మధ్య సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సెయిలర్స్, సోల్జర్స్ ఆరోగ్య సంరక్షణ, ఆపరేషనల్ మెడిసన్, వైద్య సంసిద్ధతలో ఉత్తమ సేవలు తదితర అంశాలపై పరస్పర సహకారం అందించుకునేందుకు ఇరు దేశాల మధ్య సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ ఎక్స్ఛేంజ్(ఎస్‌ఎంఈఈ) ఒప్పందం జరిగింది. యుద్ధ సమయంలోనూ, విపత్తుల సమయంలోనూ వైద్య సంరక్షణ, ఏరో మెడికల్, క్యాజువాలిటీ మేనేజ్‌మెంట్ మొదలైన విభాగాలపై దృష్టి సారించినట్లు భారత్, యూఎస్ నౌకాదళ ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు.. యుద్ధ నౌకల్లో సహాయ సహకారాలపైనా ఎస్‌ఎంఈఈ ఇరుదేశాల మధ్య జరిగింది.
కొనసాగుతున్న
టైగర్ ట్రయాంఫ్–25 విన్యాసాలు

సైనికుల వైద్య సేవలకు యూఎస్–భారత్ ఎంవోయూ