
గూడెం కొత్తవీధిలో భారీ వర్షం
గూడెంకొత్తవీధి: మండల కేంద్రం గూడెంకొత్తవీధి లో సోమవారం మధ్యాహ్నం నుంచి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆర్వీనగర్‌లో వారపుసంతకు వచ్చిన చిరువ్యాపారులు వర్షం కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ తీగలపై పలు చోట్ల చెట్లకొమ్మలు విరిగిపడటంతోపాటు మరికొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.
రాజవొమ్మంగి: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. రబీ సీజన్‌లో సాగుచేస్తున్న పొగాకు పంటకు ఈ వర్షం మేలు చేస్తుందని రైతులు తెలిపారు. వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. ద్విచక్రవాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
చింతపల్లిలో
చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో సోమవారం మధ్యాహ్నం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం 8గంటల వరకూ మంచు కురిసి, చలి వాతావరణం ఉండగా మధ్యాహ్నం రెండు గంటల వరకూ విపరీతమైన ఎండ కాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడి గంటపాటు వర్షం కురిసింది. రహదారులు
జలమయమయ్యాయి.

గూడెం కొత్తవీధిలో భారీ వర్షం