సాక్షి, విశాఖపట్నం: నాతో మీకు సెల్ఫీ కావాలా? అయితే పర్యావరణ పరిరక్షణ కోసం 10 మొక్కలు నాటండి.. అప్పుడే మీకు సెల్ఫీ ఇస్తాను. లేదంటే.. లేదు.. ఇదీ వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు. సెల్ఫీ కోసం ఎందుకీ నిబంధనలు అనేగా మీ డౌటనుమానం! అయితే ఈ కథనం చదివేయండి.
ఇటీవల వాల్తేరు డివిజన్ పరిధిలో రైల్వే ఉద్యోగాలు ఇస్తామంటూ రూ.లక్షల వసూళ్లకు పాల్పడి మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో చాలా మంది మోసగాళ్లు డీఆర్‌ఎంతో సెల్ఫీ దిగిన ఫొటోలను యువతకు చూపించిన మోసం చేసినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. ఈ తరహా మోసగాళ్లకి చెక్ పెట్టేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని తన కార్యాలయ వర్గాలను డీఆర్‌ఎం ఆదేశించారు.
రైల్వే అధికారిక కార్యక్రమాల్లో ఇతరులెవ్వరూ హాజరుకాకుండా చర్యలు తీసుకోవాలని, రైల్వే ఉద్యోగులెవ్వరైనా డీఆర్‌ఎంతో సెల్ఫీ దిగొచ్చని స్పష్టం చేశారు. బయట వ్యక్తులెవ్వరైనా సెల్ఫీ అడిగితే.. వారు కచ్చితంగా క్యాలెండర్ ఈయర్‌లో 10 మొక్కలు నాటుతామని హామీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సెల్ఫీ దిగే వ్యక్తిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేయడంతో పాటు పూర్తి వివరాలను డీఆర్‌ఎం సెక్రటేరియట్‌కు అందించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ సర్క్యులర్ డివిజన్ పరకిధిలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment