అనకాపల్లి టౌన్: స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు చికెన్, ఎగ్ మేళా నిర్వహిస్తున్నట్లు నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు మందపాటి జానకీరామరాజు తెలిపారు. ప్రజలందరికీ చికెన్, ఎగ్ వినియోగం వలన లాభాలు వివరించి, బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ఉన్న అపోహలు తొలగించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కోడి మాంసం, గుడ్లతో చేసిన రుచికరమైన ఐటమ్స్ ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment