అధిక పరిహారం కోసం పోలవరం రైతుల డిమాండ్
అనకాపల్లి: పోలవరం కాలువ నిర్మాణం కోసం అనకాపల్లి పట్టణంలో సౌత్–1 రెవెన్యూ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు ప్రస్తుత రేటుకు మూడు రేట్లు అధికంగా పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. గవరపాలెం జాతీయ రహదారి సౌత్–1 సమీపంలో బుద్ద గంగునాయుడు షెడ్ వద్ద పోలవరం కాలువ అధికారి జి.రాజేంద్రప్రసాద్ సోమవారం రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోలవరం కాలువ నిర్మాణానికి సుమారు 15 సంవత్సరాల క్రితం భూములను సేకరించారని, అప్పటి ధరకు ప్రస్తుత మార్కెట్ ధరకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. 50 మంది రైతులు భూములు కోల్పోతున్నట్లు చెప్పారు. కాలువ నిర్మాణ అధికారి జి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆ విషయాన్ని ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
రైతులు మద్దాల రాజు, పెంటకోట సరోజిని, కాండ్రేగుల ప్రసాద్, విలేజ్ రెవెన్యూ అధికారి కిషోర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment