విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు
అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న జయప్రకాష్
అనకాపల్లి: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని సమగ్రశిక్షా జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ జయప్రకాష్ అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కొప్పాక జెడ్పీ హైస్కూల్ ఆవరణలో జిల్లాలో ఏపీ మోడల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, ఏపీ రెసిడెన్సీ స్కూల్స్ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు పాల్‌ల్యాబ్‌పై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహంచారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన విద్యనందించాలని చెప్పారు. డిప్యూటీ డీఈవో అప్పారావు మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో పాల్‌ల్యాబ్ జిల్లా నోడల్ అధికారి వి.శ్రీలక్ష్మి, ఏఎస్‌వో రాధాకృష్ణ, డీఎన్‌వో శ్రీనివాసరావు, హెచ్‌ఎం సుమామణి, సమగ్ర శిక్ష సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment