అదనపు కట్నం ఇవ్వలేదని కుల బహిష్కరణ!
సోమవారం ఉదయం 7 గంటలు.. బిలబిలమంటూ 200మంది పోలీసులు దిగారు.. సుమారు 100మంది రెవెన్యూ సిబ్బంది వచ్చారు.. వచ్చీ రావడంతోనే వైఎస్సార్‌సీపీ నాయకుడు, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు సోదరుడు సత్యనారాయణ భవనం కూల్చివేతకు పాల్పడ్డారు. నోటీసులో రెండు రోజులు గడువిచ్చారు కదా.. భవనాన్ని యజమానే తొలగించుకునేందుకు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ అభ్యర్థించినా తహసీల్దార్ ససేమిరా అన్నారు. దగ్గరుండి మరీ కూల్చివేత పనులను జరిపించారు. ఇంతలో 10.47 గంటలకు భవనం తొలగింపును నిలిపివేయాలని హైకోర్టు నుంచి ఉత్తర్వులు రావడంతో ఎట్టకేలకు విధ్వంసకాండను అధికారులు విరమించుకున్నారు. కానీ అప్పటికే రెండో ఫ్లోర్ శ్లాబ్ సగం తొలగించారు. కింద పోర్షన్ గోడలను ధ్వంసం చేశారు.
● కలెక్టరేట్ వద్ద బాధితుల నిరసన ● పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన ● కోడ్ ఉందని కలెక్టర్ వద్దకు అనుమతించని పోలీసులు
శైవ క్షేత్రాల ముస్తాబు
హిందువులంతా పవిత్రంగా జరుపుకునే పర్వదినమే మహా శివరాత్రి.. ఆ రోజున శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి.
మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
రెవెన్యూ అధికారులు ధ్వంసం చేసిన ఇంటి గోడలు
నేటి నుంచి మద్యం దుకాణాల మూసివేత
● ఎమ్మెల్సీ ఎన్నిక ముగిసే వరకు ఆంక్షలు
తుమ్మపాల: ఈనెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలో అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే మార్చి 3న కూడా మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు.
నర్సీపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్సార్‌సీపీ నేతల భవనాల కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడికి వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను టార్గెట్ చేశారు. అక్రమ నిర్మాణాల పేరుతో నాయకుల భవనాలను కూల్చివేసి ఆర్థికంగా దెబ్బ తీసేందుకు యత్నిస్తున్నారు. మొన్న నవంబర్‌లో గచ్చపువీధిలోని వైఎస్సార్‌సీపీ నాయకుడు చిటికెల కరుణాకర్ భవనాన్ని మున్సిపల్ అధికారులు పడగొట్టారు. నేడు శారదనగర్‌లోని వైఎస్సార్‌సీపీ నాయకుడు, బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు సోదరుడు సత్యనారాయణ భవనం కూల్చివేతకు పాల్పడ్డారు. ఉదయం 7 గంటలకే తహసీల్దార్ రామారావు భారీసంఖ్యలో పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని వెంటపెట్టుకొని బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ నాయకులతో భవనం వద్దకు వచ్చారు. యజమానే భవనం తొలగించుకుంటాడని, సమయం ఇవ్వమని తహసీల్దార్‌ను కోరినప్పటికీ వినలేదు. భవనంలో ఫర్నిచర్‌ను రెవెన్యూ సిబ్బంది బయటకు తీస్తుండగా భవన యజమాని, పార్టీ నాయకులు అడ్డుకున్నారు. అంతలోనే కూల్చివేత పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో అధికారులు అక్కడ నుంచి జారుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
కోర్టుల ద్వారా ఎదుర్కొంటాం
స్పీకర్ అయ్యన్నపాత్రుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ అకృత్యాలను న్యాయస్ధానాల ద్వారా ఎదుర్కొంటామన్నారు. వందలాదిమంది అధికారులు మూకుమ్మడిగా వచ్చి కూల్చివేతకు పాల్పడ్డారని, సమయం ఇవ్వమని కోరినా వినని అధికారులు హైకోర్టు ఉత్తర్వులతో జారుకున్నారన్నారు. అయ్యన్నపాత్రుడి కుట్రలకు వ్యతిరేకంగా కోర్టుల్లో పోరాడదామని, న్యాయ దేవతే మనల్ని కాడాపడుతుందని క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఐదేళ్లకేనని, 50 ఏళ్లకు కాదన్న విషయాన్ని అయ్యన్నపాత్రుడు గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. మేము టీడీపీ నాయకులపై ఇదే విధంగా వ్యవహరించాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలన్నీ టీడీపీ హయాంలోనే జరిగాయని, కొత్తగా చేసిన నిర్మాణాలు కాదన్నారు. రాజకీయ ప్రత్యర్థులల ఇళ్లు కూల్చివేసే విధానం వల్ల సామాన్య ప్రజలకు నష్టం జరుగుతుందని, స్పీకర్ అయ్యన్నపాత్రుడు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. స్పీకర్ రాజకీయ కక్షతో తన భవనాన్ని కూల్చివేస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. అయ్యన్నపాత్రుడి ఒత్తిళ్లకు లొంగిన అధికారులు గడువు ఇవ్వకుండా భవనాన్ని కూల్చివేయడం అన్యాయమని ఆవేదన చెందారు. రాజకీయంగా తనను ఎదుర్కొలేక తన ఆస్తులపై పడ్డారన్నారు. అమరావతిలో ఉన్న స్పీకర్ ఫోన్ ద్వారా ఆదేశాలు ఇస్తూ, తనపై కక్ష సాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, కోఆప్షన్ సభ్యులు షేక్ రోజా, పార్టీ పట్టణ అధ్యక్షులు ఏకా శివ ప్రసాద్, పార్టీ నాయకులు చింతకాయల వరుణ్, లీగల్ సెల్ అధ్యక్షుడు మాకిరెడ్డి బుల్లిదొర, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బయపురెడ్డి నాగ గజలక్ష్మి, యూత్ అధ్యక్షుడు తమరాన శ్రీను, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మామిడి శ్రీను అండగా నిలిచారు.
న్యూస్‌రీల్
కొనసాగుతున్న రాజకీయ కూల్చివేతలు
వైఎస్సార్‌సీపీ నాయకుడు కర్రి శ్రీనివాస్ సోదరుడి భవనం ధ్వంసం
వందలాదిమంది పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో విధ్వంసం
స్వచ్ఛందంగా తొలగించుకుంటామన్నా అంగీకరించని అధికారులు
ఇంతలో కూల్చివేత నిలిపివేయాలని హైకోర్టు నుంచి ఉత్తర్వులు
ధ్వంసమైన గ్రౌండ్ ఫ్లోర్ గోడలు, రెండో ఫ్లోర్ శ్లాబ్
చిల్లర రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ మండిపాటు
అదనపు కట్నం ఇవ్వలేదని కుల బహిష్కరణ!
అదనపు కట్నం ఇవ్వలేదని కుల బహిష్కరణ!
Comments
Please login to add a commentAdd a comment