అనకాపల్లి టౌన్ : పదవతరగతి విద్యార్ధులు తమ హాల్ టికెట్లను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి జి.అప్పారావు నాయుడు తెలిపారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో అభ్యర్థులు తమ వాట్సప్ ద్వారా 95523 00009 నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పంపి, సేవను ఎంచుకోని విద్యా సేవలు ఆప్షన్ పై క్లిక్ చేసి ఎస్‌ఎస్‌సి హాల్ టికెట్‌ని ఎంచుకొని, విద్యార్థి అప్లికేషన్ నంబర్‌ని నమోదు చేసి, పుట్టిన తేదీ నమోదు చేయాలని, ఆపై స్ట్రీమ్‌లో రిసీవ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలని ఆయన వివరించారు. ఈ హాల్ టికెట్‌ను సంబంధిత పాఠశాలల యాజమాన్యాలతో సరిచూసుకోవాని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment