నర్సీపట్నం: బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్, వైఎస్సార్‌సీపీ నాయకుడు కర్రి శ్రీనివాసరావుకు హైకోర్టులో ఊరట లభించింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా శ్రీనివాసరావు సోదరుడు సత్యనారాయణ భవనాన్ని కూలగొట్టారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడిని దూషించారంటూ టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్లతో శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. శ్రీనివాసరావు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేయవద్దని, 41 నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment