మహిళల భాగస్వామ్యంతో గ్రామీణాభివృద్ధి
కె.కోటపాడు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో కె.కోటపాడు జెడ్పీటీసీ ఈర్లె అనురాధ మంగళవారం పాల్గొన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున ఎంపిక చేసిన ముగ్గురు జెడ్పీటీసీలతో కలిసి ఆమె పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యంతో గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వర్క్‌షాప్‌లో వివరించినట్లు అనురాధ తెలిపారు. వర్క్‌షాప్‌లో కేంద్ర పంచాయతీరాజ్, ఫిషరీస్, పశుసంవర్ధకశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, సహాయ మంత్రి ఎస్.పి.సింగ్, కేంద్ర మహిళా, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణదేవి పాల్గొన్నట్లు అనురాధ తెలిపారు.
జాతీయ వర్క్‌షాప్‌లో వివరించిన జెడ్పీటీసీ అనురాధ
Comments
Please login to add a commentAdd a comment