పక్కాగా పదో తరగతి పరీక్షలు
● విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుడు విజయభాస్కర్
అనకాపల్లి: ఈ నెల 17 నుంచి జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఎటువంటి అక్రమాలు, ఆరోపణలకు తావు లేకుండా నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహించాలని విద్యాశాఖ విశాఖ ప్రాంతీయ సంచాలకుడు (ఆర్జేడీ) బి.విజయభాస్కర్ పేర్కొన్నారు. అనకాపల్లి గుండాల కూడలిలో ఉన్న జీవీఎంసీ ఎస్సార్ శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సెల్‌ఫోన్లు, వాచ్‌లు, తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరాదని, అధికారులు, సిబ్బంది వద్ద కూడా ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
జిల్లా ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ శ్రీధర్‌రెడ్డి, డీసీసీబీ కార్యదర్శి సిహెచ్ సత్యనారాయణ (కిట్టు), కార్యాలయ పర్యవేక్షకుడె రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment