కుళ్లిన కోడిగుడ్ల సరఫరాపై గర్భిణుల ఆందోళన
యాదగిరిపాలెంలో కుళ్లిన కోడిగుడ్లు
మునగపాక : యాదగిరిపాలెం అంగన్‌వాడీ కేంద్రం నుంచి గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేస్తున్న కోడిగుడ్లు నిల్వ ఉండిపోవడంతో కుళ్లిన వాసన వస్తుందని పలువురు ఆందోళనకు గురయ్యారు. పలువురు గర్భిణులు స్థానికంగా ఉండే అంగన్‌వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న కోడిగుడ్లు, పాలు తీసుకువెళతారు. సుమారు 10 రోజుల క్రితం సరఫరా చేసిన గుడ్లను ఉడికించేందుకు గర్భిణి యత్నించగా కుళ్లిన వాసన రావడంతో ఆందోళనకు గురయ్యారు. కోడిగుడ్లు నిల్వ ఉన్నవిగా గుర్తించి సంబంధిత అంగన్‌వాడీ టీచర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో పెద్దలు కొంతమంది కలుగజేసుకొని నిల్వ ఉన్న గుడ్లను పంపిణీ చేయకుండా చూసుకోవాలని ఇకపై ఇలాంటి తప్పులు జరిగితే సహించేది లేదని పలువురు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment