ఆర్‌ఏఆర్‌ఎస్‌లో చెరకు విత్తనం సిద్ధం
అనకాపల్లి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 2009ఎ 107, 2009ఎ 252, 2012 ఎ 319, 93 ఎ 145 రకాల చెరకు విత్తనం అందుబాటులో ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్‌చార్జి ఏడీఆర్ పీవీకే జగన్నాథరావు తెలిపారు. కావలసిన రైలులు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వారిని సంప్రదించాలన్నారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. పిలక దశలో రబీ వరిపైరులో ఎకరాకు 35 కిలోల యూరియా వేసుకోవాలన్నారు. వరి నాటిన 30 రోజుల్లో ఫినోక్సప్రాప్ ఈథైల్ అనే కలుపు మందును ఎకరానికి 250 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితుల్లో వరిలో జింకు లోపం కనిపించే అవకాశం ఉందన్నారు. లోప సవరణకు 2 గ్రాముల జింకు సల్ఫేట్ 5 గ్రాముల యూరియాను ఒక లీటరు నీటితో కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలన్నారు. పొడి వాతావరణం ఉండడం వల్ల అపరాలు బెట్ట పరిస్థితులకు గురయినట్లతే తేలికపాటి తడి ఇవ్వాలని సూచించారు. నువ్వు పంట వేసిన 30 రోజులకు తేలికపాటి తడి ఇవ్వాలన్నారు. ఎకరాకు 20 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలన్నారు. చెరకు కార్శి తోటకు మోళ్లు చెక్కిన పిదప ఎకరాకు వంద కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ 80 కిలోమ్యారేట్ ఆఫ్ పొటాష్ దుబ్బులకు దగ్గరగా గోతులు తీసి ఎరువు వేసి మట్టితో కప్పిన తర్వాత తేలికపాటి తడిని ఇవ్వాలన్నారు. చెరకు కార్శి చేసిన వెంటనే ప్రోపికొనజోల్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. చెరకు మొక్కతోటలు నాటే ముందు ఎకరాకు కార్బొఫూరాన్ 3జి 13 కిలోలు లేదా ఫిప్రొని 0.3జి 10 కిలోలు క్లొరాంట్రినిలిఫ్రొల్ 0.4జి 9 కిలోలు చొప్పున చాళ్లలో 1.2 నిష్పత్తిలో ఇసుకతో కలిపి వేసినట్లయితే పీక పురుగు ఉధృతిని తగ్గించవచ్చని సూచించారు. మామిడి తేనే మంచు పురుగు ఆశిస్తే ఇమిడక్లోప్రిడ్ 0.4 మి.లీ బుప్రోఫెజిన్ 1.6 మి.లీ కర్బెండిజం 1 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. పూత మొదలయ్యే సమయం పిందెలు తయారయ్యే సమయంలో పూత ఆకులపైనే కాకుండా మొదళ్లపైన కొమ్మల పైనా పిచికారీ చేయాలన్నారు. సమావేశంలో డాక్టర్ కె.వి. రమణమూర్తి, డాక్టర్ వి. గౌరీ, డాక్టర్ బి. భవాని, డాక్టర్ చంద్రశేఖర్, పి.వి. పద్మావతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment