పేదల ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ వేగవంతం
తుమ్మపాల: ప్రభుత్వం పేదలకు కల్పిస్తున్న ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పథకాన్ని అర్హులందరికీ అమలు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. పీజీఆర్‌ఎస్, రీసర్వే, గ్రామసభలు, వెబ్‌ల్యాండ్, ఇళ్ల స్థలాల రీ–వెరిఫికేషన్, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రికార్డు రూమ్‌ల నిర్వహణ వంటి అంశాలపై బుధవారం కలెక్టరేట్‌లో అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవితో కలిసి ఆమె సమీక్షించారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో 2019 మార్చి 15 నాటికి ఇల్లు కట్టుకుని, ప్రస్తుతం నివాసముంటూ, ఇంటికి సంబంధించిన ఆధార పత్రాలు కలిగి, ఎక్కడా ఇల్లు లేనివారు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు. 150 గజాలలోపు స్థలంలో ఇల్లు కట్టుకున్న పేదవారికి ఉచితంగా, అంతకంటే ఎక్కువ స్థలం కలిగిన వారికి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రుసుము వసూలు చేసి క్రమబద్ధీకరిస్తామన్నారు. జేసీ ఎం.జాహ్నవి మాట్లాడుతూ రీ–సర్వేపై గ్రామసభల్లో వచ్చిన అర్జీలన్నింటినీ రెండు రోజుల్లో పరిష్కరించాలన్నారు. వెబ్‌ల్యాండులో మార్పుల కోసం ప్రతిపాదనలను సర్వే నంబరు, సబ్ డివిజన్ వివరాలతో పంపించాలన్నారు. చౌకధరల దుకాణాలు, గోడౌన్లు, బియ్యం మిల్లులను తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, కె.ఎంె.ఆర్.సి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, బి.జె.ఆర్.యు.ఎస్.ఎస్. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.రమామణి, ఆర్డీవోలు వి.వి.రమణ, షేక్ ఆయిషా,క లెక్టరేట్ పరిపాలనాధికారి బి.వి.రాణి, సెక్షను సూపరింటెండ్‌ంట్లు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గోపాలరాజ, తహసీల్దార్లు పాల్గొన్నారు.
మహిళా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
తుమ్మపాల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ కోసం, జిల్లా, మండల స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణకు సంబంధించి బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. అదేరోజున మహిళల భద్రత కోసం మహిళా శక్తి యాప్‌ను జిల్లా స్థాయిలో సీ్త్రలు, పిల్లల విభాగాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. జిల్లా, మండల స్థాయిలో కార్యక్రమం జరిగే ప్రదేశాలలో శక్తి యాప్ లోగో ఏర్పాటు చేసి, యాప్‌పై మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేయాలని, పోషకాహార ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక స్వయం సహాయక బృందం సభ్యులకు సన్మానం చేయాలని, జిల్లా స్థాయిలో వివిధ రంగాల్లో విజయవంతమైన మహిళలను సన్మానించాలని సూచించారు. అదేరోజు బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందివ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, ఐసీడీఎస్ పీడీ అనంతలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ శచిదేవి, డీఎంహెచ్‌వో రవికుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజారావు, మెప్మా పీడీ సరోజిని, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు పెంటోజీరావు, కె.పద్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశంలోకలెక్టర్ విజయ కృష్ణన్
Comments
Please login to add a commentAdd a comment