చెరకు సాగు ప్రశ్నార్థకం
దారి కాచి దారుణం...
ఈ ఏడాది ఆదిలోనే కష్టాలు ఇప్పటికీ 10 శాతం కూడా ప్రారంభం కాని చెరకు నాట్లు ఆందోళన చెందుతున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులను పట్టించుకోని ప్రభుత్వం
● నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య
● బైక్ అడ్డగించి పీక కోసిన గుర్తు తెలియని వ్యక్తులు
● మూడు ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం పోలీసుల గాలింపు
8లో
చోడవరం : రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో జిల్లాలో చెరకు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు బెల్లం, పంచదార ఫ్యాక్టరీలతో ఎక్కడ చూసినా వేలాది ఎకరాల్లో చెరకు సాగుతో పొలాలన్నీ కళకళలాడేవి. ఫిబ్రవరి నెల నుంచే చెరకు నాట్లు వేస్తూ అంతా సందడిగా ఉండేది. ఈ ఏడాది ఆ సందడే కానరాలేదు. ఐదునెలలుగా కనీస వర్షాలు కురవకపోవడం, సుగర్ ఫ్యాక్టరీ రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు ఈ ఏడాది చెరకు పంటపై అనాసక్తి కనబరుస్తున్నారు. గత నెలలోనే ప్రారంభం కావలసిన చెరకు నాట్లు మార్చినెల ప్రారంభమైనా 10శాతం కూడా వేయలేదు. జిల్లాలో 4సుగర్ ఫ్యాక్టరీలు, ఒక అంతర్జాతీయ బెల్లం మార్కెట్ ఉండడంతో ఏటా 2 లక్షల ఎకరాల్లో చెరకు సాధారణ సాగు జరిగేది. అయితే మూడు ఫ్యాక్టరీలు మూతపడడంతో చెరకు సాగు విస్తీర్ణం తగ్గుకుంటూ రాగా ఈ ఏడాది ఘోరంగా 60 శాతానికి మించి సాగు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. గతేడాది కంటే 20 శాతం విస్తీర్ణం తగ్గిపోనుందని సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అందోళన చెందుతుంది. గతేడాదే తగ్గిన చెరకు సాగుతో ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యాన్ని చేరుకోలేక ఫ్యాక్టరీ చతికిలబడుతోంది.
గానుగ లక్ష్యం..నానాటికీ తీసికట్టు...
గోవాడ ఫ్యాక్టరీ 5.2 లక్షల టన్నుల సామర్ధ్యం ఉన్నప్పటికీ కేవలం 1.5 లక్షల టన్నులే లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు కేవలం 60 వేలు టన్నులు మాత్రమే క్రషింగ్ చేసింది. మరో 40 వేల టన్నులకు మించి క్రషింగ్ జరిగే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలోనే చెరకు నాట్లు ప్రారంభమై మార్చి నాటికి 30 శాతానికి మించే నాట్లు జరిగేవి. జిల్లాలో అత్యధికంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పరిధిలోనే సుమారు 80వే ఎకరాలకు పైబడి చెరకు పండిస్తారు. అలాంటిది ఈ ఏడాది అక్కడక్కడ వ్యవసాయ బోర్ల సాయంతో కొందరు నాట్లు వేస్తున్నప్పటికీ వారు కూడా చెరకు పంటపై మక్కువతోనే వేస్తున్నామంటూ నిట్టూర్చడం చెరకు సాగు భవితవ్యంపై ప్రశ్నార్థకం వ్యక్తమౌతుంది. ఉడుపులు ముమ్మరమయ్యే సమయంలో వర్షాలు కురవకపోవడం, జలాశయాలు, నదులు, చెరువులు, కొండగెడ్డల్లో నీటి నిల్వలు లేకపోవడంతో సాగుపై రైతులు నిరాశకు గురయ్యారు. మోటార్ల సాయంతోనైనా నాట్లు వేద్దామంటే భూగర్భ జలాల్లో నీటి నిల్వలు అడుగంటడం.. ఇవన్నీ రైతుకు గుదిబండగా మారాయి.
పట్టించుకోని ప్రభుత్వం
చెరకు రైతులను, సుగర్ ఫ్యాక్టరీలను ఆదుకొని గిట్టుబాటు ధర ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. మద్దతు ధర టన్నుకు రూ.3100లకు మించి ఇవ్వలేదు. దీనితో రైతులు చెరకుకు బదులు ప్రత్యామ్నాయంగా సరుగుడు, ఇతర పంటలు వేయడానికే సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితిలో ఫ్యాక్టరీలు, ప్రభుత్వం రైతులను ఆదుకుంటే తప్ప ఈ ఏడాది చెరకు కనీస విస్తీర్ణంలో కూడా సాగు జరిగేలా లేదని రైతులు అంటున్నారు.
చెరకు సాగు ప్రశ్నార్థకం
చెరకు సాగు ప్రశ్నార్థకం
Comments
Please login to add a commentAdd a comment