మధురవాడ: ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొమ్మాది రిక్షా కాలనీలోని విశాఖపట్నం డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( సీవోఈ)లో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం(ఇంగ్లీషు మీడియం)లో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి గడువు పెంచినట్టు ప్రిన్సిపాల్ శాంతికుమారి తెలిపారు. తొలుత మార్చి 6వరకు మాత్రమే అవకాశం ఉందని ప్రకటించగా తాజాగా 13వ తేదీ వరకు పొడిగించారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాకి చెందిన బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. https:// apbragcet.apcfss. in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
Comments
Please login to add a commentAdd a comment