పాకలపాడులో కేంద్రబృందం
లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరిస్తున్న కేంద్ర బృందం సభ్యులు
గొలుగొండ : పాకలపాడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలపై గురువారం కేంద్రం బృందం సభ్యులు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ప్రజలతో సమావేశం అనంతరం కేంద్రం మంజూరు చేసిన రోడ్లు, గృహాలు పింఛన్లు, డ్వాక్రా సభ్యులు పనితీరు, గ్రామ సడన్‌యోజన పథకం తీరుపై పరిశీలన చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరులో అర్హత పొందిన లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి వాటి పనితీరు, అందే విధానం గురించి క్షణ్ణంగా పరిశీలన చేశారు. గ్రామాల్లో పేదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు అందుతున్నాయని వాటి పనితీరుపై పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తున్నట్టు కమిటీ సభ్యులు వికాస్ మలేకర్, భానుచందర్, లోకేష్ తదితరులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో మేరీ రోజ్‌తో పాటు పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment