ఉక్కును కాపాడుకోవడమే నా విధానం: అయోధ్యరామ్
స్టీల్‌ప్లాంట్ నోటీసులపై అయోధ్యరామ్ గట్టిగానే స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ స్పందించారు. నోటీసులతో గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే.. వేల గొంతులు ఒక్కటై పిక్కటిల్లేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నోటీసుకు ప్రతిస్పందనగా యాజమాన్యానికి లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల హక్కుల గురించి పోరాడటమే తన విధానమనీ.. స్టీల్‌ప్లాంట్‌ని కాపాడుకునేంత వరకూ రోడ్డెక్కి ఉద్యమిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. సీఐటీయూ నాయకునిగా కార్మికుల సమస్యలపై పోరాడటం తమ బాధ్యత అన్నారు. నోటీసులో పేర్కొన్న సమస్యలపై తమ పోరాటం కొనసాగిస్తామే తప్ప భయపడేది లేదని తెగేసి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment