బుచ్చెయ్యపేట: మండలంలోని ఆర్.శివరాంపురం గ్రామం వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. రాజాం నుంచి మల్లాం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని కూడ్రం నుంచి రాజాం వైపు వస్తున్న స్కూల్ వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో గొరపల్లి మణి, అప్పారావు, ఆది బుల్లికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనంలో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సు యాజమాన్యం కనీసం బాధితులను పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment