గీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపు
అనకాపల్లి: జిల్లాలో మద్య నిషేధ అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు 15 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించినట్టు డీఆర్‌వో వై.సత్యనారాయణ తెలిపారు. స్థానిక గుండాల జంక్షన్ ఎస్‌ఆర్ శంకరన్ ఫంక్షన్ హాల్లో గురువారం లాటరీ పద్ధతి ద్వారా గీత కులాల వారికి షాపులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 మద్యం దుకాణాలకు 205 దరఖాస్తులు వచ్చాయన్నారు. మద్యం షాపు దక్కించుకున్న దరఖాస్తుదారుడు తక్షణమే రిటైల్ ఎకై ్సజ్ టాక్స్ రూ.5,41,667 లేదా రూ.4,58,333 మొదటి విడతగా చెల్లించి లైసెన్స్ పొందాలన్నారు. కల్లుగీత కార్మికులకు కేటాయించిన 15 మద్యం దుకాణాల నాన్ రిఫండబుల్ కింద రూ.4.10 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. లైసెన్స్ ఫీజు కింద రూ.78.75 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మద్య నిషేధ అబ్కారీ శాఖ అధికారి వి.సుధీర్, అబ్కారీ అధికారి రాజశేఖర్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
షాపు లబ్ధిదారుడు
అనకాపల్లి రూరల్ సీహెచ్.మారుతీరాజు
మునగపాక పిల్లి శ్రీను
రోలుగుంట దార శ్రీనివాస్
కోటవురట్ల దమ్ము రోహిణి
మాకవరపాలెం రేలంగి కిరణ్‌కుమార్
నాతవరం చిన్ని నానాజీ
యలమంచిలి రేలంగి ఎల్.ఎన్.అశ్విని
రాంబిల్లి కడాలి రాజ్యలక్ష్మి
దేవరాపల్లి సిమ్మా దేమళ్లు
బుచ్చియ్యపేట అనసూరి అనంద్
పాయకరావుపేట లవిటి నూకరాజు
నక్కపల్లి దొడ్డి అప్పలరాజు
వి.మాడుగుల యల్లంకి లావణ్య
చీడికాడ సమ్మంగి లక్ష్మణ్
రావికమతం కడవల ఉపేంద్ర
దుకాణాలు దక్కించుకున్న గీత కార్మికుల వివరాలు
Comments
Please login to add a commentAdd a comment