100 అడుగుల వెడల్పున లంకెలపాలెం–అసకపల్లి రోడ్డు
● భూ సేకరణ గ్రామ సభలో ఆర్డీవో షేక్ ఆయిషా
సబ్బవరం: మండలంలోని పైడివాడ అగ్రహారం నుంచి లంకెలపాలెం–అసకపల్లి రోడ్డును అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామంలోని ఏపీఐఐసీ ఎంఎస్‌ఎంఈ పార్కు వరకూ రెండు వరసల రహదారిగా విస్తరించనున్నట్లు ఆర్డీవో షేక్ ఆయిషా తెలిపారు. మండలంలోని పైడివాడ అగ్రహారంలో రోడ్డు విస్తరణకు అవసరమయ్యే భూ సేకరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో 100 అడుగుల వెడల్పున రెండు లేన్లలో 2.68 కి.మీ. మేర ఈ రోడ్డును విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ డీపీఆర్ ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందన్నారు. గ్రామంలో 12.26 ఎకరాల మేర భూమిని సేకరించే అవకాశం ఉందని వెల్లడించారు. విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు వీఎంఆర్‌డీఏ ద్వారా టీడీఆర్ బాండ్లు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ చిన్నికృష్ణ, మండల సర్వేయర్ అప్పారావు, ఆర్‌ఐ వీరయ్య, వీఆర్వో దేముడుబాబు, ఎంపీటీసీ సీరం అప్పలరాజు, గ్రామ పెద్దలు అక్కిరెడ్డి దుర్గినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment