చెరకు తోటలో చకచకా..
చెరకు తోటలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఆ మహిళా రైతు పేరు సుంకరి అప్పారావమ్మ. బుచ్చెయ్యపేట మండలం కేపీ అగ్రహారానికి చెందిన ఆమె భర్తకు దీటుగా 30 ఏళ్లుగా చెరకు సాగు పనుల్లో పాల్గొంటోంది. మగవారికి సమానంగా ఆడవారు కష్టపడితేనే కుటుంబం హాయిగా సాగుతుందని, ఎంతో ఆత్మవిశ్వాసం కలుగుతుందని ఆమె చెబుతోంది. 3 ఎకరాల్లో చెరకు తోట సాగు చేస్తున్నామని, చెరకు నాట్లు, గొప్పులు, పొలంలో అన్ని రకాల పనులు చేయగలనని చెప్పింది. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఈ ఏడాది సక్రమంగా నడవకపోవడంతో బెల్లం ఆడి లాభాలు వచ్చేలా చూసుకుంటున్నామని చెప్పింది. ఇద్దరు అబ్బాయిల్ని, అమ్మాయిని చదివించి వారికి వివాహాలు చేశామని, ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నామని తెలిపింది. మగవారితోపాటు ఆడవారు కష్టపడితే ఆర్థిక ఇబ్బందులుండవని పేర్కొంది. – బుచ్చెయ్యపేట
చెరకు తోటలో చకచకా..
Comments
Please login to add a commentAdd a comment