క్షయ రహిత పంచాయతీగా భీమవరం ఎంపిక
బుచ్చెయ్యపేట: ఆర్.భీమవరాన్ని క్షయ రహిత పంచాయతీగా కేంద్రం ఎంపిక చేసినట్లు జిల్లా క్షయ నివారణాధికారి ఎస్.వి.కె.బాలాజీ తెలిపారు. ముక్త భారత్‌లో భాగంగా శుక్రవారం ఆయన తురకలపూ డి పీహెచ్‌సీ సిబ్బందితో సమావేశం నిర్వహించా రు. ఈనెల 24వ తేదీన టీబీ డే సందర్భంగా కేంద్ర బృందం అనకాపల్లి వచ్చి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందిస్తారన్నారు. క్షయ నిర్మూలనకు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. వైద్యాధికారి డి.సంధ్యారాణి, కో ఆర్డినేటర్ అయ్యపురెడ్డి పెంటయ్య, ఆరోగ్య విస్తరణాధికారి రాజశేఖర్, ఫార్మాసిస్టు చంద్రమౌళి, పీహెచ్‌ఎన్ సీతమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment