విద్యార్థుల వికాసం కోసం..
టీచర్‌గా పాఠాలు బోధించడాని కే పరిమితం కాలేదు ఆమె. సేవలతో ఆదర్శప్రాయంగా నిలిచారు. విద్యార్థులు మెచ్చే మార్గదర్శిగా గుర్తింపు పొందారు. కె.జె.పురం జెడ్పీ హై స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పారుపల్లి వెంకటసత్య పద్మజ. పనిచేసిన ప్రతి పాఠశాలలో తనదైన ముద్ర వేశారు. ఆమె వెంకటాపురం ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు 2019లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును గురుపూజోత్సవం సందర్భంగా అందుకున్నారు. ఆ పాఠశాలకు ఆమె రూ.1.35 లక్షల విలువ చేసే 10 ఇనుప బెంచీలను విరాళంగా అందజేశారు. చినగదిలి మండలం లక్ష్మీనగర్, వెంకటాపురం పాఠశాల విద్యార్థుల కోసం కంచాలు, గ్లాసులు, షూలు అందించారు. పేద విద్యార్థులకు ఫీజులు కడుతుంటారు. కొత్తపాలెం హైస్కూలు విద్యార్థుల కు పుస్తకాలను పంపిణీ చేశారు. ఉపాధ్యాయిని పద్మజ ఎన్‌సీసీ స్టూడెంట్ కూడా. అదే స్ఫూర్తితో వెంకటాపురం పాఠశాలలో 92 మంది విద్యార్థులకు రూ.97 వేలు విలువ చేసే ఆర్మీ యూనిఫాం కుట్టించారు. వారితో చక్కని ఫొటో దిగి వారిని ప్రోత్సహించారు. – మాడుగుల రూరల్
Comments
Please login to add a commentAdd a comment