నర్సీపట్నం: మాకవరపాలెం మండలం జంగాలపల్లిలో భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ చైర్మన్ బొంతు రమణ తెలిపారు. ఈ మేరకు శుక్ర వారం నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణకు ఫిర్యాదు చేశారు. సుమారు 30 ఎకరాల్లో ఇసుక మేటలను అడ్డుగోలుగా తవ్వేస్తున్నారని, పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ, పోలీసు పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉచిత ఇసుక ముసుగులో రాత్రింబవళ్లు తేడా లేకుండా రవాణా చేస్తున్నారని, తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు లేవని వాపోయారు. స్థానిక నాయకులు కోట్లాది రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment