రూ.11 లక్షలతో నిమ్మకట్టు కాలువకు సీసీ లైనింగ్
నాతవరం: వచ్చే ఖరీఫ్‌కు శివారు ఆయకట్టుకు సైతం నిమ్మకట్టు ఆనకట్ట నీరందేలా కాలువలు అభివృద్ధి చేస్తున్నామని తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ తెలిపారు. మండలంలో రాజుపేట అగ్రహారం సమీపంలో తాండవ నదిపై నిర్మించిన నిమ్మకట్టు ఆనకట్ట ప్రధాన కాలువకు చేస్తున్న సిమెంటు లైనింగ్ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.11 లక్షలతో ఆనకట్ట ప్రధాన గేటు దిగువ ప్రాంతంలో పంట కాలువకు సిమెంటు లైనింగ్ చేస్తున్నామన్నారు. ఆనకట్ట నిర్మాణ సమయంలో చేసిన పనులు పూర్తిగా శిథిలమై రాళ్లు తేలిపోయాయన్నారు. దాంతో పూడిక తీసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని ఆయకట్టు రైతుల కోరిక మేరకు సిమెంటు లైనింగ్ చేస్తున్నామన్నారు. కాలువకు ఇరువైపులా కొంతమేర గోడ నిర్మిస్తామన్నారు. ఈ వేసవిలో రెండు జిల్లాల సరిహద్దులో కాలువలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు నాతవరం సెక్షన్ జేఈ శ్యామ్‌కుమార్, మన్యపురట్ల పరిధి తాండవ ప్రాజెక్టు నీటి సంఘం అధ్యక్షుడు అప్పన దివాణం, వర్కు ఇన్‌స్పెక్టరు అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.
తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ
Comments
Please login to add a commentAdd a comment