స్నేహితుని వివాహానికి వచ్చి మృత్యువాత
రాంబిల్లి(అచ్యుతాపురం): స్నేహితుడి వివాహానికి వచ్చిన ఐటీఐ విద్యార్థి శారదా నదిలో ఈతకు దిగి మృతి చెందాడు. రాంబిల్లి మండలం కొత్తూరులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రావికమతం మండలానికి చెందిన ఎస్.మణికంఠ విశాఖలోని ప్రైవేట్ ఐటీఐలో చదువుతున్నాడు. కొత్తూరులో తన స్నేహితుని వివాహానికి గురువారం విచ్చేశాడు. ఇక్కడ తన స్నేహితులతో కలిసి శారదా నదిలో సరదాగా ఈతకు దిగాడు. ఆ సమయంలో ఈత కొడుతూ పెద్ద గొయ్యిలో మునిగిపోయాడు. ఎంతకూ బయటకు రాకపోవడంతో మిగిలిన ఫ్రెండ్స్ గట్టిగా కేకలు వేశారు. దాంతో చుట్టు పక్కల వారు వచ్చి పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శారదా నదిలో ఈతకు దిగి
రావికమతం విద్యార్థి మృతి
Comments
Please login to add a commentAdd a comment