సారా రహిత సమాజమే ధ్యేయం
● నవోదయం 2.0 రథాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
తుమ్మపాల : నాటుసారా రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు గ్రామ గ్రామాన ప్రజల్లో నాటు సారాకు వ్యతిరేకంగా చైతన్యం కలిగించడమే లక్ష్యంగా ప్రచార రథాన్ని ప్రారంభించినట్టు జిల్లా ఇన్‌చార్జి, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పట్టణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో పాటు స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా , జేసీ జాహ్నవిలు విచ్చేసి పోస్టర్, రథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు సారాను పూర్తిగా నియంత్రించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అందరిలో ఉందన్నారు. జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సూర్జిత్ సింగ్ మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 202 నాటుసారా కేసులు నమోదు చేసి, 107 మంది నిందితులను అరెస్టు చేయడమైందన్నారు. 1,022 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. సారా తయారీలో ఉపయోగించే 69, 260 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేసి, 15,289 కేజీల బెల్లం స్వాధీన పరుచుకున్నామని, 10 వాహనాలను జప్తు చేశామని, అదేవిధంగా 550 మంది పాత నేరస్తులపై నిఘా ఉంచి వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్‌న్, ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.రాజశేఖర్, ఎకై ్సజ్ సీఐ వై.లక్ష్మున్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment