కూటమి పాలనలో 43 మంది కార్మికుల మృతి
అనకాపల్లి: జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిది మాసాల్లోనే 43 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఎస్సెన్షియా కంపెనీలో జరిగిన సంఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారని, సీఎం చంద్రబాబునాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వసుధ మిశ్రా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కమిటీ రిపోర్టు ఆధారంగా అన్ని భద్రతా చర్యలను తీసుకుంటామన్నారు. జిల్లాలో కెమికల్ కర్మాగారాలు ఉన్నాయని, ఇక్కడ త్వరలో బర్న్ వార్డులతోపాటు రెండు బర్న్ అంబులె న్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, పరి శ్రమల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నూకాంబిక సేవలో మంత్రి...
ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్.సుజాత అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
కూటమి పాలనలో 43 మంది కార్మికుల మృతి
Comments
Please login to add a commentAdd a comment