చెరువులో పడి యువకుడి మృతి?
పరవాడ: మండలంలోని భర్నికం గ్రామానికి చెందిన బలిరెడ్డి సూర్య లక్ష్మీనారాయణ(32) చెరువులో చేపల వేటకు దిగి నీటిలో మునిగిపోయి మృతి చెందినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు చెప్పారు. గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో స్నేహితులతో కలిసి లక్ష్మీనారాయణ ఆదివారం మధ్యాహ్నం చేపల పట్టడానికి చెరువులో దిగాడు. చేపల వేట సాగిస్తూ నీటిలో మునిగిపోయి ఎంతకి రాకపోవడంతో తోటి స్నేహితులు పరవాడ పోలీసులకు, బంధువులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టినా రాత్రి వరకు మృతదేహం లభ్యం కాలేదు. సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సీఐ మల్లికార్జునరావు చెప్పారు. గాలింపు చర్యల్లో పరవాడ ఎస్‌ఐ మహాలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment