కారు ఢీకొని వ్యక్తి మృతి
మాడుగుల రూరల్ : తాటిపర్తి శివారు గరికబంద గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాడేరు గ్రామానికి చెందిన వేమగిరి రమేష్(47) మృతి చెందారు. ఎస్‌ఐ జి. నారాయణరావు సోమవారం విలేకరులకు తెలిపిన వివరాలివి. పాడేరు గ్రామానికి చెందిన వేమగిరి రమేష్ తన ద్విచక్రవాహనంపై మాడుగుల నుంచి పాడేరు వెవెళ్తుండగా, తాటిపర్తి శివారు గరికబంద సమీపంలో పాడేరు నుంచి మాడుగుల వైపు వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో రమేష్ తలకు బలమైన గాయాలు తగిలాయి. వెంటనే రమేష్‌ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పుత్రికి తీసుకెళ్లగా, అప్పటికే రమేష్ చనిపోయాడు. ఘటనపై రమేష్ సోదరుడు వేమగిరి వెంకట సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment