ఈ ప్లేట్లు... | - | Sakshi
Sakshi News home page

ఈ ప్లేట్లు...

Published Mon, Mar 17 2025 11:24 AM | Last Updated on Mon, Mar 17 2025 11:19 AM

ఈ ప్ల

ఈ ప్లేట్లు...

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌

వంద గ్రాములుగడ్డితో 3 ప్లేట్లు

ఎండు గడ్డిని నీటితో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేయాలి. వీటిలో 1 కేజీ గడ్డి ముక్కలు తీసుకుని వాటిని బాగా ఎండబెట్టాలి. సగటున 100 గ్రాముల వరి గడ్డిలో 7 లీటర్‌ వాటర్‌ వేసి మరిగించాలి.15 నిమిషాల పాటు బాగా ఉడికించిన తరువాత అందులో సోడియం హైడ్రాక్స్‌డ్‌ క్రిష్టల్‌ను వేసి గంటన్నర పాటు ఉడికించాలి. ఆ తరువాత జల్లెడలో వేసి వరిగడ్డి నుంచి నీరును సెపరేట్‌ చేయాలి. మిగిలిన వరి గడ్డిని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ప్లేట్‌ సైజ్‌ కన్నా పెద్దగా స్కీన్‌ లేదా గాజు గ్లాస్‌పై వేసి 24 గంటల పాటు ఎండబెట్టాలి. ఎండిన తరువాత షీట్‌గా ఏర్పడుతుంది. దీనిని హైడ్రాలిక్‌ ప్రెస్‌ యంత్రంలో పెట్టి ప్రెస్‌ చేస్తే ప్లేట్‌ ఏర్పడుతుంది. ఈ ప్లేట్‌కు పైన విస్తరాకు గానీ లేదా నేలలో కలిసిపోయేలా బయోగ్రెడిబుల్‌ ఫిల్మ్‌గాని వేస్తారు. దీంతో డిస్పోజల్‌ ప్లేట్‌ తయారు అవుతుంది. సగటున 100 గ్రాముల వరి గడ్డికి 3 నుంచి 4 ప్లేట్లు తయారవుతాయి.

సాక్షి, అనకాపల్లి: అధిక పెట్టుబడులతో ఆశించిన దిగుబడి లేక రైతు నష్టాల బాట పడుతున్నాడు. వాతావరణ మార్పులు, ఇతర పరిస్థితుల కారణంగా పంట నష్టపోయి లాభాలార్జించలేని పరిస్థితిలో రైతు ఉన్నాడు. దేశంలోనే వరి పంట పండిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్‌ టెన్‌లో ఉంది. రైతు మీదే యావత్‌ దేశం ఆధారపడుతుంది. అందుకే రైతుకు మేలు చేకూరేలా..అదే విధంగా పర్యావరణాన్ని పరిరక్షించేలా.. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్‌ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ఎండు గడ్డి, అరటి కాండంతో డిస్పోజల్‌ ప్లేట్ల తయారు చేశారు. రైతుకు అదనపు ఆదాయం సంపాదించుకునేలా సరికొత్తగా ప్రాజెక్టు చేసి చూపించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ పి.వి.కె.జగన్నాథరావు, డాక్టర్‌ ఎ.కేశవకుమార్‌, ఈవీఎస్‌ కుమారి పర్యవేక్షణలో అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులు రక్షిత, ఎం.కీర్తి స్వరూప, పి.గురుసాయి, ఆర్‌.ఉదయ్‌కుమార్‌

ఈ ప్రయోగం ద్వారా డిస్పోజల్‌ ప్లేట్లు తయారు చేయవచ్చని చేసి చూపించారు. వరి పంట వేసే రైతు నూర్పు తరువాత ఎండు గడ్డిని కొంతమేర పశువులకు మేతగా ఉపయోగిస్తాడు..పశువులు తినగా మిగిలిన మరికొంత గడ్డి పశువుల పాకలుగా వాడుతుంటారు. తరువాత కూడా మిగిలి వృధాగా పడి ఉన్న ఎండు గడ్డిని కాల్చివేస్తుంటారు. ఇలా వృధా చేసేకంటే ఆ గడ్డితో డిస్పోజల్‌ ప్లేట్లు తయారీ చేసుకుని అదనపు ఆదాయం ఆర్జించవచ్చని ఆర్‌ఏఆర్‌ఏస్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని చోట్ల మిగిలిపోయిన ఎండు గడ్డి కాల్చడం ద్వారా కార్బన్‌ డైఆకై ్సడ్‌ విడుదలై పర్యవరణం కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పొగ ద్వారా ఆస్తమా, శ్వాసకోస వ్యాధులు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇలా వృథాగా పడి ఉన్న వరిగడ్డిని ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అగ్రికల్చర్‌ విద్యార్థులు డిస్పోజబుల్‌ ప్లేట్లుగా తయారు చేశారు. సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు.

ఎండు గడ్డి, అరటి బెరడుతో డిస్పోజబుల్‌ ప్లేట్ల తయారీ

పర్యావరణ హితం, ఆరోగ్య దాయకం

రైతుకు అదనపు ఆదాయం

ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ

అరటిడొప్పతో...

అరటి మొక్క నుంచి గెల కాసిన తరువాత దాన్ని నరికేస్తారు. అలా నరికేసిన అరటి కాండం నుంచి చెట్టు డొప్పల నుంచి ఫైబర్‌ను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి బాగా ఎండబెట్టాలి. ఇందులో సోడియం హైడ్రాకై ్సడ్‌ క్రిస్టల్‌ను వేసి ఒక గంట పాటు బాయిల్‌ చేస్తారు. ఆ పేస్ట్‌ను జల్లెడలో వేసి వాటర్‌ తీసేస్తారు. షీట్‌ను ప్లేట్‌ మౌల్డింగ్‌ మిషన్‌ దగ్గరకు తీసుకెళతాం. 100 గ్రాములు కాండం నుంచి 5 నుంచి 6 ప్లేట్లు తయారు చేయవచ్చు.

రైతుకు ఎంతో మేలు..

నేను అగ్రికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో గల అనకాపల్లి పాలిటెక్నిక్‌ ఇంజినీరింగ్‌లో థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాను. మూడు నెలల పాటు నేను చేసిన ప్రాజెక్ట్‌లో భాగంగా పర్యావరణాన్ని కాపాడుతూ..రైతుకు మేలు చేకూర్చేలా ఈ ప్రయోగ విధానం చేశాం. రైతుకు పంట దిగుబడి అనంతరం వృధాగా పడేసే గడ్డితో డిస్పోజబుల్‌ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు.సోడియం హైడ్రాక్స్‌డ్‌ క్రిష్టల్‌ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్లేట్‌ మౌల్డింగ్‌ మిషన్‌ ఒక్కటే కొనుగోలు చేసుకుంటే వారంతట వారే డిస్పోజబుల్‌ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త జగన్నాధరావు సహకారంతో డిస్పోజబుల్‌ ప్లేట్లు ప్రాజెక్టు చేశాం.

–కీర్తి స్వరూప, థర్డ్‌ ఇయర్‌ విద్యార్థిని, పాలిటెక్నికల్‌ ఇంజినీరింగ్‌.

ప్లాస్టిక్‌కుప్రత్యామ్నాయంగా...

ప్లాస్టిక్‌ వినియోగం పెరగడంతో పర్యావరణం దెబ్బతింటుంది. ఎక్కువగా వినియోగించే డిస్పోజబుల్‌ ప్లేట్లతో మరింతగా పర్యావరణం దెబ్బతింటుంది. అంతేకాకుండా రైతులు పండించే వరిలో వృధాగా పడేసే ఎండుగడ్డి వంటివి కాల్చడం ద్వారా కార్బన్‌డైఆకై ్సడ్‌ విడుదల అవుతుంది. అందుకే మా విద్యార్థులతో కలిసి ఎకో ఫ్రెండ్లీ డిస్పోజబుల్‌ ప్లేట్లు ప్రయోగాత్మకంగా తయారీ చేశాం.పర్యావరణాన్ని కాపాడడంతో పాటు రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా ఉపయోగపడేలా రూపొందించాం.

–డాక్టర్‌ ఎ. కేశవ్‌కుమార్‌, టీచింగ్‌ అసోసియేట్‌, పాలిటెక్నిక్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌. అనకాపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
ఈ ప్లేట్లు...1
1/4

ఈ ప్లేట్లు...

ఈ ప్లేట్లు...2
2/4

ఈ ప్లేట్లు...

ఈ ప్లేట్లు...3
3/4

ఈ ప్లేట్లు...

ఈ ప్లేట్లు...4
4/4

ఈ ప్లేట్లు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement