27న దేవరాపల్లి ఎంపీపీ ఎన్నిక
దేవరాపల్లి: దేవరాపల్లి ఎంపీపీ పదవికి ఈ నెల 27న ఎన్నిక నిర్వహించనున్నట్లు స్థానిక ఎంపీడీవో ఎం.వి.సువర్ణరాజు తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 27న ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరించి, 12 గంటలకు పరిశీలిస్తామన్నారు. ఒంటి గంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించి వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. అనంతరం ఒంటి గంటకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించి పూర్తయిన వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా గతేడాది ఏప్రిల్ 15న ఎంపీపీ పదవికి కిలపర్తి రాజేశ్వరి రాజీనామా చేశారు. దీంతో అప్పడు వైస్ ఎంపీపీగా ఉన్న చింతల బుల్లిలక్ష్మీని ఇన్‌చార్జ్ ఎంపీపీగా ఉన్నతాధికారులు నియమించడంతో ఇప్పటి వరకు ఆమె కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment