అనకాపల్లి టౌన్: తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ 102లో పనిచేస్తున్న కెప్టెన్స్‌కి కనీస వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి వి.వి.శ్రీనివాస రావు కోరారు. స్ధానిక జిల్లా సీఐటీయూ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలు గా రూ.7,870 వేతనానికే పనిచేస్తున్నారన్నా రు. నేషనల్ హెల్త్ మిషన్‌లో గర్భిణులు, బాలింతలకు తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చడం, అత్యంత నైపుణ్యం కలిగి ఉండాలని, తగిన విద్యార్హతలు ఉన్నా కనీస వేతనం లేకపోవడంతో దుర్భరమైన పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అలాగే మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ముగిసిపోతున్న నేప థ్యంలో వీరికి రూ. 18,500 జీతాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, బీమా, ఇతర అలవెన్స్ సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.కృష్ణ, డి.శ్రీనివాసరావు, ఎ.నర్సింగ్‌రావు పాల్గొన్నారు.