యలమంచిలి పట్టణ బడ్జెట్ రూ.11.94 కోట్లు
●సుప్రీం తీర్పునకు టీడీపీ సర్కారు తూట్లు
IIలో
నక్కపల్లి: సుప్రీంకోర్టు తీర్పుననుసరించి డీఫా రం రైతులకు నష్ట పరిహారం, ప్యాకేజీ చెల్లించిన తర్వాతే రోడ్డు పనులు ప్రారంభించాలంటూ డీఎల్‌పురం గ్రామానికి చెందిన నిర్వాసితులు మంగళవారం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. సర్వే నంబరు 193 నుంచి 199 వరకు ఉన్న 64 ఎకరాల ప్రభుత్వ భూములను 1967లో పేదలకు డీఫారం పట్టాలు పంపిణీ చే శారని, తాజాగా ప్రభుత్వం విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా రాజయ్య పేట సమీపంలో ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంటు కోసం భూములు సేకరించి వాటిలో రోడ్లు, డ్రెయినేజీ పనులు చేపట్టారన్నారు. డీఎల్‌పురంలో పేదలకు చెందిన 64 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్డు పనులు చేపడుతున్నారని బాధిత రై తులు ఆరోపించారు. నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు వ్యవహారం తేలకముందే ఏపీఐఐసీ అఽధికారులు పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని దౌర్జ న్యంగా పేదలకు చెందిన భూముల్లో రోడ్డు పను లు ప్రారంభించారని అన్నారు. దీనిపై బాధిత రైతులంతా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వీరికి సీపీఎం జిల్లాకార్యదర్శి జి.కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, సర్పంచ్ కిల్లాడ కృష్ణ, మాజీ ఎంపీటీసీ గింజాల వెంకటరమణ సంఘీభావం ప్రకటించా రు. తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. సీపీఎం మండల కన్వీనర్ ఎం.రాజేష్, రైతు నాయకులు పాల్గొన్నారు.
డీఫారం భూములకు నష్ట పరిహారం చెల్లించాలి
తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వాసితుల ధర్నా