
మళ్ల సతీష్‌కు ఐఐఎం ఇండోర్ అకడమిక్ ఎక్సలెన్సీ అవార్డు
ఐఐఎమ్ ఇండోర్ పాలక మండలి చైర్మన్ మురుగన్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సతీష్
అనకాపల్లి టౌన్: భారత ప్రభుత్వ సంస్థ ఐఐఎం ఇండోర్‌లో అకడమిక్ ఎక్సలెన్సీ అవార్డును పట్టణానికి చెందిన మళ్ల శ్రీకర్ సతీష్ సాధించారు. సతీష్ 2022లో క్యాట్ ద్వారా ఎంపికై ఎంబీఏ పూర్తి చేసుకొని పట్టా పొందారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాఽథన్ ఆనంద్ సమక్షంలో ఐఐఎం ఇండోర్ పాలక మండలి చైర్మన్ మురుగన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.