
దైవ దర్శనానికి వెళుతూ..
నక్కపల్లి: జాతీయ రహదారిపై గొడిచర్ల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన మిత్రులు కీర్తి చక్రరావు (52), గోళ్ల శివ (48), వెంకటరమణలు కలిసి రెండు మోటారు సైకిళ్లపై రేబాక గ్రామంలో ఉన్న గూడుపమ్మతల్లి ఆలయానికి దర్శనం కోసం వెళ్తున్నారు. గొడిచర్ల దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న మోటారు సైకిళ్లను గొడిచర్ల సమీపంలో ఇన్నోవా వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో చక్రరావు, శివలు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో చక్రరావు తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలో మరణించాడు. శివతోపాటు మరో బైక్‌పై వెనుక వస్తున్న వెంకటరమణకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరిని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివ ఆస్పత్రిలో మరణించాడు. ప్రమాద విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌లకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చక్రరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుని బంధువులు బోరున విలపిస్తున్నారు. ఇన్నోవా వాహనం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కుమారస్వామి తెలిపారు.
సత్యవరంలో విషాదం
మృతుల స్వస్థలం పాయకరావుపేట సత్యవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన కీర్తి చక్రరావు, గోళ్ల శివ మరణించడంతో గ్రామ ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. చక్రరావుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివకి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులు వ్యవసాయ కూలీలుగా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారి మరణంతో రెండు కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డాయి. బాధిత కుటుంబాలకు చెందిన వారి రోదనలతో నక్కపల్లి, తుని ఆస్పత్రులు ప్రతిధ్వనించాయి.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం..
మరొకరికి గాయాలు
వీరంతా ఒకే గ్రామానికి చెందిన మిత్రులు
గొడిచర్ల సమీపంలో ద్విచక్ర వాహనాలను కారు ఢీకొనడంతో ప్రమాదం

దైవ దర్శనానికి వెళుతూ..

దైవ దర్శనానికి వెళుతూ..

దైవ దర్శనానికి వెళుతూ..

దైవ దర్శనానికి వెళుతూ..