జర్మనీ భాషపై శిక్షణ, ఉద్యోగావకాశాలు
అనంతపురం: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో జర్మనీ భాషపై శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీవీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. మెకట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సిస్టమ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు దక్కుతాయి. మెకట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సిస్టమ్, ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమో పూర్తి చేసిన వారై 18 నుండి 40 సంవత్సరాల్లోపు వయస్సు కలిగివారై ఉండాలి. కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. రోజుకు 8 గంటలు చొప్పున వారానికి 40 గంటలు పనిచేయాలి. రెండు సంవత్సరాల కాంట్రాక్టు కింద ఉద్యోగాలు కల్పిస్తారు. నెలకు ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.2.52 లక్షల నుంచి రూ.3.28 లక్షలు చెల్లిస్తారు. వీసా, విమాన చార్జీలు భరించాల్సి ఉంటుంది. రూ.30 వేలు డాక్యుమెంటేషన్ చార్జీలు, రూ.40 వేలు డిపాజిట్ చేయాలి. జర్మనీకి వెళ్లిన అనంతరం తిరిగి ఆ నగదు ఇస్తారు. ఏ–2 స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆఫ్‌లైన్ శిక్షణ, బీ–1 స్థాయిలో ఇతర రాష్ట్రంలో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ శిక్షణ కల్పిస్తారు. పాస్‌పోర్టు, స్కూల్ లీవీంగ్ సర్టిఫికెట్, డిప్లొమో/ డిగ్రీ సర్టిఫికెట్, ఉద్యోగ అనుభవ సర్టిఫికెట్, లైట్ లేదా హెవీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ నెల 25లోపు దరఖాస్తు చేయడానికి గడువుగా నిర్దేశించారు. skillinternational@apssdc. inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 99888853335, 87126 5586, 8790118349 నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment