
వేలేరుపాడు: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఓ 95 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్‌ను జయించారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన వృద్ధుడు షేక్ అబ్దుల్లాకు గత నెల 22న జ్వరం, ఆయాసం రావడంతో కుటుంబసభ్యులు వేలేరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చి పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు మరింత మెరుగైన చికిత్స అందించారు. దీంతో వృద్ధుడు కోలుకున్నారు. ఈ నెల 31న డిశ్చార్జ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment